ప్రముఖ దివంగత నటుడు రాజేశ్ ఖన్నా కుటుంబ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. రాజేష్ ఖన్నాతో చివరి పది సంవత్సరాలు కలిసి జీవించిన అనితా అద్వాని ఆ ఫ్యామిలీలో తన స్టేటస్ ఏంటి అనే దానిపై ముంబై హైకోర్టు తీర్పుతో ఏకీభవించలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అనితా అద్వానీ వాదన ప్రకారం రాజేష్ ఖన్నా, ఆయన భార్య డింపుల్ ఖన్నా ఇరవై సంవత్సరాలకు పైగా విడిపోయి ఉన్నారని..తాను ఆయనతో పదేళ్ల పాటు సహజీవనం చేశానని అంటున్నారు. రెండు దశాబ్దాలుగా విడిపోయిన వారు ఎలా భార్యభర్తలవుతారు...పదేళ్ల పాటు కలిసి ఉన్న తాము ఎందుకు భార్యభర్తలం కాదని ఆమె తన ఫిటిషన్లో పేర్కొన్నారు.
ఆయన మరణం తర్వాత డింపుల్, ఆమె కుమార్తె ట్వింకిల్ ఖన్నా, అల్లుడు అక్షయ్‌కుమార్ తనను హింసిస్తున్నారంటూ ఆమె ముంబై హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు అనిత గృహహింస చట్టం పరిధిలోకి రాదని చెప్పడంతో విబేధించిన అనిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు సహజీవనాన్ని ఆమోదించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.