ఏపీ రాజ‌ధానిపై ఢిల్లీలో నోటీసులు

Update: 2015-11-05 06:30 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఢిల్లీలో త‌ల‌నొప్పి వ‌చ్చిప‌డింది. రాజ‌ధాని నిర్మాణంలో ఆదేశాల‌ను ఉల్లంఘించంచార‌ని పేర్కొంటూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. సుదీర్ఘ‌వాద‌న‌లు విన్న‌త‌ర్వాత తాజా తీర్పును సుప్రీంకోర్టు విడుద‌ల చేసింది. ఏపీ ప్ర‌భుత్వం స‌హా రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ( సీఆర్‌ డీఏ), ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లకు నోటీసులు జారీచేసింది.  వారం రోజుల్లోగా ఈ నోటీసులకు ప్ర‌తిస్పందించాల‌ని ఆదేశించింది.

రాజధాని అమ‌రావ‌తి ప‌నుల్లో భాగంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసిన‌ త‌ర్వాతే నిర్మాణ ప‌నులు చేప‌ట్టాలని నిబంధ‌న‌లో ఉంది. అయితే శంకుస్థాప‌న ప‌నుల్లో భాగంగా హ‌డావుడిగా ప‌నులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల అర‌టితోట‌లు తొల‌గించారు. శంకుస్థాపన ప్రక్రియలో బాగంగా తమ తుది తీర్పు వెలువడేవరకు ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని అక్టోబ‌ర్ 10న పర్యావరణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.  గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన వెంటనే రాజధాని గ్రామాల్లో పర్యటించిన శ్రీమన్నారాయణ అనే పర్యావరణవేత్త‌ అనుమతులు లభించలేదని ప్రచారం చేశారు. అయిన‌ప్ప‌టికీ హ‌డావుడిగా ప‌నులు పూర్తికావ‌డంతో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ చేతుల మీదుగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు - తోట‌ల తొల‌గింపు - శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం త‌దిత‌రాల‌ను ప్ర‌స్తావిస్తూ కోర్టును ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.
Tags:    

Similar News