బోఫోర్స్ స్కాంలో చిక్కి కాంగ్రెస్ ఎలా విలవిల్లాడిందో... ఆ స్థాయిలో బీజేపీని రాఫెల్ డీల్ తో ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే... ఈ రాఫెల్ మీద మాట్లాడి మాట్లాడి రాహుల్ ఏకంగా మాటలే నేర్చాడు. అంత స్థాయిలో కాంగ్రెస్ దీనిపై రచ్చ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే... రాఫెల్ మీద ఆశతో ఏకంగా 2019 ఎన్నికల ద్వారా ప్రధాని సీటుపై కన్నేశారు రాహుల్. అయితే, దీనిపై రాహుల్ గాంధీకి భారీ షాక్ తగిలింది. ఆయన ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది.
ఇంతకీ ఏం జరిగిందంటే...
*రాఫెల్ డీల్*లో భారీ స్కాం జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరగాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పలుమార్లు ఇప్పటికే కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. ఇద్దరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్లు కొట్టేస్తూ ఈరోజు కీలక తీర్పువెలువరించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.
ఈ కేసు కొట్టేస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది... *మాకు రాఫెల్ డీల్ కు సంబంధించి ఏమీ అనుమానాస్పందంగా కనిపించడం లేదని, ఆ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అనుమానాలు అవసరం లేదని, వాటి ఖరీదెంత తదితర విషయాలు పరిశీలించాల్సిన అవసరం లేదనుకుంటున్నామని చెప్పింది. రక్షణశాఖ కొనుగోళ్లు సున్నితమైన అంశమని.. అందులో గోప్యత పాటించే హక్కు ప్రభుత్వానికి ఉందని కోర్టు చెప్పింది. ఇందులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరమేదీ లేదని స్పష్టం చేసింది.
ఈ డీల్ విషయంలో నరేంద్రమోడీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. చాలాసార్లు మోడీ దీని గురించి ఏమీ స్పందించలేకపోయారు. ఒకటి రెండు సార్లు మాత్రమే దీనిని అబద్ధమని చెప్పారు కాని చాలా సార్లు మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కోర్టు తీర్పురాగానే...ఆఫ్ సెట్ భాగస్వాముల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని కోర్టు గుర్తించిందని - అలాగే అసలు విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అనవసర రాద్ధాంతం చేసే వారికి ఇది చెంపపెట్టు వంటి తీర్పు అమిత్ షా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే... దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం బీజేపీకి కొత్త కాదు. అయితే న్యాయ వ్యవస్థనీ మేనేజ్ చేసిందని మాకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి... అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. చూస్తుంటే... కోర్టు తీర్పుని కూడా కాంగ్రెస్ ఓ ఆయుధంలా చేసుకునేలా కనిపిస్తోంది.