ఇండియా అనే పేరును భారత్ లేదా హిందుస్తాన్ గా మార్చాలంటూ సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ ను దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు విచారించింది. రాజ్యాంగాన్ని సవరించాలని ఇండియా అనే పదాన్ని భారత్ తో భర్తీ చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
పిటిషనర్ తన రిట్ పిటిషన్ కాపీని సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపమని సూచించింది. ఈ విషయంపై ముందుగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ కు సూచించింది. అధికార యంత్రాంగం సదరు పిటిషన్ పై స్పందించిన తర్వాత కాని దానిని విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియా అనే పేరును భారత్ లేదా హిందుస్తాన్ గా మార్చాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు పిటిషన్ దాఖలైంది. అలా పేరు మార్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు..