ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీని వేటాడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై కోర్టుల్లో పిటీషన్లు వేసి ముప్పుతిప్పలు పెడుతున్న ఆయన.. తాజాగా తన నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీం కోర్టుకు గతంలోనే ఎక్కారు. తాజాగా కోర్టు విచారణలో టీడీపీకి షాక్ తగిలింది.
తెలుగుదేశం పార్టీకి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. గుంటూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణంలో భూ కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన ఈ భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు.
పిటీషనర్ ఆర్కే తరుఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.దీనిపై మూడు వారాల్లోకి సమాధానం ఇవ్వాలని మంగళవారం నోటీసులు పంపింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు మూడు వారాల తర్వాత చేపట్టనుంది.
గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు పిటీషన్ ను విచారణకు స్వీకరించి విచారిస్తోంది.