సుప్రీం మాట; యాసిడ్ బాధితులు వికలాంగులే

Update: 2015-12-07 09:32 GMT
దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఒక కీలక అంశంపై తన తీర్పును ఇచ్చేసింది. తమకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ఎవడో దుర్మార్గానికి బలైపోవటం యాసిడ్ బాధితుల జీవితాల్లో చోటు చేసుకుంటుంది. అప్పటివరకూ ఉన్న జీవితానికి.. యాసిడ్ దాడి అనంతరం వారి జీవితాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. యాసిడ్ దాడికి గురైన వారెంతో నష్టపోతుంటారు.

మరి.. ఇలాంటి వారిని వికలాంగులుగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా విస్పష్ట తీర్పు ఇచ్చేసింది. యాసిడ్ దాడులకు గురైన వారు వికలాంగులేనని తేల్చి చెప్పింది. వారికి.. వికలాంగులకు ఎలాంటి వసతులు.. రాయితీలు కల్పిస్తారో అవన్నీ కల్పించాలని స్పష్టం చేసింది.

తాజాగా తామిచ్చిన తీర్పును అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని చెప్పటమే కాకుండా.. నిబంధనల ప్రకారం వారికి పునరావాసం.. పరిహారం అందించాలని కూడా ఆదేశించింది. ఎవరో కుట్రకు బలైన ఎంతోమందికి తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు ఎంతోకొంత సాంత్వన కలిగిస్తుందనటంలో సందేహం లేదు. 
Tags:    

Similar News