అయోధ్య వివాదాస్ప‌ద క‌ట్ట‌డంపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు!

Update: 2019-07-11 09:00 GMT
ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న అయోధ్య‌లోని వివాదాస్ప‌ద క‌ట్టడంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకోవాలంటూ ఏర్పాటు చేసిన క‌మిటీ కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు తాజాగా కీల‌క‌ వ్యాఖ్య‌లు చేసింది. వివాదాస్ప‌ద క‌ట్ట‌డంపై ఎవ‌రికి యాజ‌మాన్య హ‌క్కులు ఉన్నాయ‌న్న దానిపై ద‌శాబ్దాల క్రితం సుప్రీంను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌స్థానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని నేప‌థ్యంలో ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి ఖ‌లీఫుల్లా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ర‌విశంక‌ర్.. ప్ర‌ముఖ సీనియ‌ర్ న్యాయ‌వాది శ్రీ‌రామ్ పంచులు ఉన్నారు. ఈ ఇష్యూపై ఉభ‌య వ‌ర్గాల‌కు ఆమోద‌యోగ్య‌మైన ప‌రిష్కారాన్ని క‌నుగొనాల‌ని నియ‌మించారు.

ఇదిలా ఉంటే తాజాగా వారొక మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించారు. సామ‌ర‌స్యపూరిత ప‌రిష్కారం కోసం.. అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యాన్ని వెతికేందుకు త‌మ‌కు మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని వారు కోరారు. దీంతో న్యాయ‌స్థాన స్పందించి క‌మిటీకి ఆగ‌స్టు 15 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. మ‌ధ్య‌వ‌ర్తిత్వం కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌టం లేదంటూ వివాదాస్ప‌ద క‌ట్ట‌డం వివాదంలో వాస్త‌వ క‌క్షిదారుల్లో ఒక‌రైన గోపాల్ సింగ్ విశార‌ద్ సుప్రీంలో ఒక పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై వాద‌న‌లు వినిపించిన ప్ర‌ముఖ న్యాయ‌వాది ప‌ర‌శ‌ర‌ణ్ వాద‌న‌లు విన్న అనంత‌రం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఈ నెల 18లోపు స‌మ‌గ్ర నివేదిక‌ను మ‌ధ్య‌వ‌ర్తిత్వం క‌మిటీ అంద‌జేయాల‌ని లేని ప‌క్షంలో తామే రోజువారీగా ఈ అంశంపై విచార‌ణ జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేసింది. వివాదాస్ప‌ద క‌ట్ట‌డంపై సుప్రీం చేసిన తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అతి త్వ‌ర‌లోనే కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News