కరోనా పరీక్షలు వాళ్లకే ఉచితం: సుప్రీంకోర్టు

Update: 2020-04-14 09:10 GMT
కరోనా దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రైవేట్ ల్యాబ్లకు కూడా కరోనా పరీక్షలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య కొన్ని చోట్ల టెస్ట్ కు రూ.4500 రేటును తీసుకోవడం తో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఉచితంగా చేయాలని ఆదేశించింది. దీంతో ప్రైవేటు ల్యాబ్ లు - ప్రైవేటు ఆస్పత్రులు గమ్మున ఊరుకున్నాయి. 

ఇప్పుడు ఈ తీర్పును సుప్రీం కోర్టు మరోసారి మంగళవారం సవరించింది. దేశంలో పేదలు - ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలంటూ తాజాగా తీర్పును ఇచ్చింది. అందరికీ ఉచితంగా పరీక్షలు చేయాలంటూ గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది.

దాన్ని విచారించిన ధర్మాసనం.. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు - దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత కరోనా పరీక్షలను పరిమితం చేయాలని పేర్కొంది. ఇందుకోసం లబ్ధిదారులు ఆయుష్ ఐడీ కార్డులు చూపించాలని సూచించింది. ఇతరులకు పరీక్షల కోసం ఫీజులు వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇక ఉచిత పరీక్షల వల్ల ప్రైవేట్ ల్యాబ్ లపై ఆర్థిక భారం పడుతుందని ఎయిమ్స్ మాజీ ఆర్డీయే అధ్యక్షుడు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తాజాగా డబ్బున్న వారి నుంచి వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Tags:    

Similar News