కర్ణాటక - తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ జలాలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఈ జల వివాదానికి సంబందించి తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీం తీర్పు ఇచ్చిన అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ రచ్చ రచ్చ జరిగింది. బస్సులు - షాపులు తగలబడిపోయాయి.. ఇద్దరు మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు.. బెంగళూరులోని ఐటీ పరిశ్రమ - ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయాలపై మరోసారి కర్ణాటక ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా... తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది.
కావేరి నది జల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నేటి నుంచి రోజుకు 6 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీం ఆదేశించింది. గతంలోని తీర్పును అనుసరించి తమ ఆదేశాలను పాటించని కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కావేరి నీళ్లు తమిళనాడుకు ఇవ్వడం కుదరదని కర్ణాటక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని.. డిసెంబర్ తర్వాతే తమిళనాడుకు నీళ్లు ఇస్తామని.. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాలని.. కర్ణాటక చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మరోసారి అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి!
కాగా... తమిళనాడుకు కావేరి నదీ జలాలను వదలకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడం.. నీళ్లు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు కర్ణాటక శాసనసభ - మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యి జలాలను వదలకూడదని ఏకగ్రీవంగా తీర్మానించడం.. దీంతో తమిళనాడుకు కావేరి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/