కేసీఆర్ స‌ర్కారుకు సుప్రీం షాక్‌!

Update: 2016-04-08 14:07 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం దూసుకెళుతుందంటూ ఉగాది ప‌ర్వ‌దినం రోజు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఉగాది స‌భ‌లో మాట్లాడుతున్న వేళ‌.. టీవీ స్ర్ర్కీన్ల మీద మ‌రో ఫ్లాష్ న్యూస్ వ‌చ్చింది. ఓప‌క్క తెలంగాణ స‌ర్కారు ఎలా దూసుకెళుతుంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ లైవ్ లో వివ‌రిస్తున్న వేళ‌.. తెలంగాణ‌లో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల విష‌యం మీద తెలంగాణ స‌ర్కారు తీరును త‌ప్పుప‌డుతూ సుప్రీంకోర్టు నిర్ణ‌యం స్కోలింగ్ గా రావ‌టం విశేషం.

ఏపీ స్థానిక‌త ఉండి తెలంగాణ‌లో విధులు నిర్వ‌హిస్తున్న విద్యుత్ ఉద్యోగుల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు వైఖ‌రిని సుప్రీం త‌ప్పు ప‌ట్టింది. ఆ ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కారు జీతాలు (ప్ర‌స్తుతం ఈ ఉద్యోగుల‌కు తెలంగాణ‌.. ఆంధ్రాలు వాటాలు వేసుకొని జీతాలు ఇస్తున్నారు) చెల్లించ‌టమేమిట‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. తెలంగాణ‌లో ప‌ని చేసినంత కాలం ఆ ఉద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం జీతాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. గ‌తంలో వీరికి రెండు రాష్ట్రాలు ఉమ్మ‌డిగా జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వ‌రిస్తూ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. తాజాగా సుప్రీం జారీ చేసిన ఆదేశాల‌తో  తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఏపీ స్థానిక‌త ఉన్న వంద‌లాది విద్యుత్ ఉద్యోగుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంద‌నటంలో సందేహం లేదు. ఈ ఉదంతంలో ఉద్యోగుల విష‌యంలో మొండిగా వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ స‌ర్కారుకు సుప్రీం తాజా తీర్పు షాకింగ్ గా చెప్పొచ్చు.
Tags:    

Similar News