​రోజాకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

Update: 2016-03-11 10:46 GMT
తనను ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా తెలుగుదేశం పార్టీ చేసిందని... దానిపై న్యాయ పోరాటం చేయడానికి పూనుకొన్న నగరి వైఎస్సీర్సీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీమ్ కోర్టులో చుక్కెదురైంది. శాసనసభ తీసుకున్న నిర్ణయంపై తామేమీ చేయలేమని సుప్రీమ్ కోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తెగేసి చెప్పడంతో.. రోజా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎలాగైనా న్యాయపోరాటం చేయాలనుకున్న వైఎస్సార్సీకి ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అయితే రోజా తరఫు న్యాయమూర్తి మాత్రం మరో బెంచ్ కు వెళతాం అని చెప్పడం కొసమెరుపు.

గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా అసభ్య పదజాలంతో సభామర్యాదలను మంటగలిపారనే నెపంతో ఏడాది పాటు శాసనసభ నుంచి వెలేసిన విషయం తెలిసిందే. ఓ మహిళా శాసనసభ్యురాలిపై ఇలాంటి చర్య తీసుకోవడం.. బహుశా శాసనసభ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. తమ ఎమ్మెల్యేను  ఏడాదిపాటు శాసనసభకు రానీయకుండా నిషేధం విధించడానికి స్పీకర్ కు ఎలాంటి అధికారం లేదని జగన్ అండ్ బ్యాచ్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి అధికారం స్పీకర్ కు లేకపోయినా... సభలోని మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని, ఒకవేళ అది తప్పని కోర్టుకు వెళ్లినా ఫలితం వుండదని గతంలోనే శాసనభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు విపక్షసభ్యులకు సూచించిన విషయం తెలిసిందే.​
Tags:    

Similar News