శిక్ష పడిన నేతల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం..

Update: 2021-11-25 14:30 GMT
ఇప్పుడున్న రాజకీయ నేతల్లో చాలా మందిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వారు చాలా కేసుల్లో నిందితులుగా కూడా ఉన్నారు. అయితే కొందరికి శిక్షలు పడినా రాజకీయ నేతలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేరం చేసిన వారిని రాజకీయాల్లో కొనసాగనీయకుండా చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు.

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలితే జీవితకాలం రాజకీయ నిషేధం చేయాలని కోరారు. ఈ పిటిష్లను స్వీకరించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘నేరస్తులు రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని కేంద్రాన్ని కోరి దాదాపు 15 నెలలవుతోంది. ఇంతకు మీరు దోషులుగా తేలిన రాజకీయ నాయకకులపై నిషేధం విధిస్తారా..? లేదా..? వారిపై జీవితకాలం నిషేధం విధించడానికి సిద్ధంగాఉన్నారా..? లేదా..? కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే చట్టాన్నిసవరించడం కదరదు.

దీనికి కోసం ఎన్నికల కమిషన్ ను సంప్రదించాలి. శాసన మార్గాన్ని అనుసరించాలా..? వద్దా..? అనేది కేంద్రం నిర్ణయించుకోవాలి.’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇక ఈ కేసులో న్యాయవాది ఉపాధ్యాయ్ వాదిస్తూ ‘ ఒక వ్యక్తి నేరం చేసి.. ఆ నేరంలో దోషిగా తేలితే మరోసారి అవకాశం ఇవ్వొద్దు.. ఒక కానిస్టేబుల్ నేరం చేసి దోషిగా తేలితే ఆ ఉద్యోగానికి అతడు అనర్హుడైనప్పుడు.. రాజకీయ నాయకులు దోషులుగా ఉంటూ గౌరవమైన పదవుల్లో ఎలా కొనసాగుతారు..? అని అన్నారు. అయితే అంతకుముందు ఉపాధ్యాయ్ సుప్రీంలో పిల్ ను దాఖలు చేశారు.

దానిపై సుప్రీం ‘మీరు ఇప్పటి వరకు ఎన్ని పిల్ లు దాఖలు చేశారు...? అని ప్రశ్నించింది. అలాగే ‘ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సుధీర్ఘకాలంగా కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటి విచారణను వేగవంతం చేయాలి‘ అని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

కాగా గతంలో క్రిమినల్ కేసుల విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులో లోపాలున్నాయని, విచారణను వేగవంతం కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని సుప్రీం కోర్టులో పలువురు న్యాయవాదులు ఏఐలె దాఖలు చేశారు.




Tags:    

Similar News