తమిళుడు నవ్వాడు. తమ సంప్రదాయ క్రీడ మీద సుప్రీం ఆదేశాల నేపథ్యంలో వారంతా కలిసికట్టుగా నిరసనలు తెలిపి.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ హడావుడిగా జల్లికట్టు మీద కొత్త చట్టాన్ని తెచ్చుకోవటంలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జల్లికట్టుపై సుప్రీం తాజాగా స్పందించింది. తమిళనాడు రాష్ట్రం కొత్తగా రూపొందించిన చట్టంపై స్టే విధించాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. దీంతో.. జల్లికట్టు ఉత్సవాలకు అడ్డం లేకుండా పోయినట్లైంది.
అయితే.. జల్లికట్టుపై తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదన్న ప్రశ్నను సంధించిన సుప్రీం.. ఆ విషయంపై సమాధానాన్ని ఆరు వారాల వ్యవధిలో తమకు తెలపాలని ఆదేశించింది. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారటంపై తమిళనాడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం.. శాంతిభద్రతల్ని పరిరక్షించాలన్న సూచన చేసింది.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో త్వరలో జరిగే జల్లికట్టు ఉత్సావాలకు అడ్డం లేకుండా పోయిందని చెప్పొచ్చు. మొత్తంగా తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు తమిళుడు చేసిన ప్రయత్నం ఫలించటమే కాదు.. సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవటం చూసినప్పుడు తమిళుడి మోము మీద నవ్వు పక్కా అని చెప్పక తప్పదు.