భర్తకు తెలీకుండా భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదైంది. కోపంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. కోపంతో తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది సదరు భార్య. హత్యానేరం మోపటం.. దానిపై కోర్టు స్పందించి తీర్పు ఇవ్వటం జరిగిపోయింది. కానీ.. తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
భర్తను చంపిన భార్య హంతకి కాదని తేల్చింది. మిగిలిన అన్ని కేసుల్లో కాకున్నా.. ఈ కేసుకు సంబంధించినంత వరకూ భార్య హంతకిగా అభివర్ణించటం తప్పుగా సుప్రీం తేల్చింది.సంచలనంగా మారిన ఈ తీర్పులోకి వెళితే.. సుప్రీం ఎందుకిలా వ్యాఖ్య చేసింది? అన్న విషయంలోకి వెళ్లితే ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది.
భర్తకు తెలీకుండా తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఒక మహిళ తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధాన్ని సాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీశాడు. ఆ సందర్భంగా మాటా.. మాటా పెరిగింది. ఆగ్రహంతో సదరు వ్యక్తి భార్యను.. కూతుర్ని ఉద్దేశించి వేశ్యులుగా అభివర్ణిస్తూ తిట్టాడు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ తన ప్రియుడుతో కలిసి భర్తను చంపేసింది. ఈ విషయం 40 రోజుల తర్వాత బయటకు వచ్చింది.
భార్యను.. ఆమెకు సహకరించిన ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. వీరికి శిక్ష విధిస్తూ స్థానిక కోర్టులు తీర్పును ఇచ్చాయి. విచారణ అనంతరం ఆమెను హంతకిగా పేర్కొంటూ తీర్పును ఇచ్చారు. దీనిపై.. సవాల్ విసిరిన సదరు మహిళ సుప్రీంను ఆశ్రయించింది. అనుకోని రీతిలో.. ఆవేశంలో జరిగిన హత్య తప్పించి ఇది పథకం ప్రకారం చేసిన హత్య కాదని సుప్రీం తేల్చింది. దీనికి తోడు ఆవేశంలో భర్త భార్యను.. కుమార్తెను ఉద్దేశించి వేశ్య అని దూషించటంతోనూ కోపం కట్టలు తెగి.. భర్తను చంపారే తప్పించి.. కావాలనో.. పథకం ప్రకారమో చంపలేదని కోర్టు పేర్కొంది. అందుకే దీన్ని హత్య అనరాదని.. భర్త మరణానికి కారణమైన భార్యను హంతకిగా పేర్కొనకూడదంటూ కోర్టు స్పష్టం చేసింది. అందుకే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ గా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సెలవిచ్చారు. సో.. భర్తను భార్య చంపేసినంత మాత్రాన ఆమెకు శిక్ష పడదు. కండిషన్స్ అప్లై అన్నది ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.