తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. అస్తులు - అప్పల పంపకాలు జరగాల్సిందేనని తీర్పులో స్పష్టం చేసిన సుప్రీ కోర్టు...పదో షెడ్యూల్ లోని అన్ని సంస్థలకూ ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. ఆస్తులు - అప్పుల పంపకాలు48: 52 నిష్పత్తిలో జరగాలని స్పష్టం చేసింది. ఏపీ వాటా 48శాతం - తెలంగాణ వాట 52శాతంగా పంపకాలు జరపాలని పేర్కొంది. పంపకాలు జరపనట్లయితే సెక్షన్ 45 వృధా అవుతందని పేర్కొంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పని సరి అని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం...సెక్షన్ 75 కేవలం సేవలకు సంబంధించినది మాత్రమేనని పేర్కొంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులోని ఉన్నత విద్యామండలి ఆస్తులు - బ్యాంకు ఖాతాలపై పూర్తిస్థాయి హక్కులు తమవేనంటూ తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు గట్టిగా వాదించింది. తన వాదన సరైనదేనని నిరూపించేందుకు హైకోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ తెలంగాణకు అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని ఏపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.. ఈ కేసులో చాలాకాలంగా కొనసాగుతున్న వాదనలు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు దీనిపై శుక్రవారం తీర్పు వెలువరించింది. రెండు కలిసి ఉన్నప్పుడు ఉన్న ఆస్తులు ఇప్పుడు కేవలం ఒక్క తెలంగాణకే ఎలా చెందుతాయని ప్రశ్నించింది. ఈ ఆస్తులన్నీ తెలంగాణవేనన్న హైకోర్టు తీర్పును కొట్టేసింది. ఉన్నత విద్యామండలి ఆస్తులు రెండు రాష్ట్రాలకు చెందుతాయని... పంచిపెట్టాల్సిందేనని స్పష్టం చేసింది.