సుప్రీం తీర్పు: ఉద్యోగుల‌కు భారీ ఎఫెక్ట్‌!

Update: 2021-01-25 12:30 GMT
స్థానిక ఎన్నిక‌ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థల విష‌యంలో తాము జోక్యం చేసుకోబోమ‌ని.. స్ప‌ష్టం చేసింది. దీంతో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముందుకు సాగేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. ప్ర‌భుత్వంతో పాటు.. ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న ఉద్యోగ సంఘాల పిటిష‌న్ల‌ను కూడా తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం.. ఉద్యోగుల విష‌యంలో కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేసింది.

ఉద్యోగులు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఎలా మాట్లాడ‌తార‌ని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. వారు అటు ప్ర‌భుత్వం, ఇటు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ అప్ప‌గించిన ప‌నులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. ఇలా దేశంలోని ఉద్యోగుల విష‌యంలో సుప్రీం కోర్టు గ‌తంలో అనేక తీర్పులు ఇచ్చింది. తాజాగా గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంలో రెండు కీల‌క తీర్పుల్లో తాజాగా ది కూడా ఒక‌టి. గ‌తంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఉద్యోగుల‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదంతో ప్ర‌భుత్వం చెప్పిన ప‌నిచేయాల్సిందేన‌ని నాడు తీర్పు వెలువ‌రించింది.

ఇక‌, ఇప్పుడు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ఎన్నిక‌ల క‌మిష‌న్‌ కు - ఉద్యోగుల‌కు మ‌ధ్య త‌లెత్తిన వివాదంలోనూ ఉద్యో గుల విష‌యంలో సుప్రీం చేసిన వ్యాఖ్య‌లు చాలా విలువైన‌విగా ఉన్నాయ‌ని అంటున్నారు న్యాయ ‌నిపు ణులు. ఉద్యోగులు త‌మ ప‌రిధి దాట‌రాద‌ని సుతిమెత్త‌గా హెచ్చ‌రించింది. వారు ప‌నిచేయ‌డానికి మాత్ర‌మే ఉన్నార‌ని.. అటు ప్ర‌భుత్వం, ఇటు ఎన్నిక‌ల సంఘం ఏది చెప్పినా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ..వారికి ఏదైనా స‌మ‌స్య ఉంటే.. దానిని ప్ర‌భుత్వంతో చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకునే వెసులుబాటు ఎలానూ ఉంటుంద‌ని.. ఈ విష‌యంలో సుప్రీం గైడెన్స్ అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News