బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అనురాగ్ ఠాకూర్ తోపాటు..బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అజయ్ షిర్కేపైనా కోర్టు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. లోథా కమిటీ సంస్కరణల అమలుకు మొండికేస్తున్న బీసీసీఐకు సుప్రీం షాకిచ్చిందని చెప్పాలి.
లోథా కమిటీ సంస్కరణల్ని అమలు చేయాలని బీసీసీఐకి సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. సుప్రీం ఆగ్రహాన్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన అనురాగ్ ఠాకూర్ కు సుప్రీం తన తీర్పుతో భారీ షాకిచ్చిందని చెప్పాలి.
నిజానికి.. లోథా సిఫార్సుల్ని అమలు చేయకపోవటం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు అవుతుందని.. ఇందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఠాకూర్ నుంచి పెద్దగా స్పందన లేకపోవటం.. ఆయన తాము చెప్పిన అంశాలపై ఉదాసీనంగా వ్యవహరించటంపై సుప్రీం ఆగ్రహంగా ఉంది. తాజాగా.. ఆయన్ను బీసీసీఐ అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. అనురాగ్ ఠాకూర్ కు సుప్రీం ఉద్వాసన పలికిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్తవారిని సుప్రీం ఎంపిక చేయనుంది. మరి.. దీనిపై అనురాగ్ ఠాకూర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/