ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్ ను విడుదల చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న కమలనాథుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. తాజాగా మోడీ బయోపిక్ తీసిన నిర్మాతలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మోడీ బయోపిక్ విడుదల చేయడానికి అనుమతించాలన్ని రివ్యూ పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఎన్నికల నేపథ్యంలో మోడీ బయోపిక్ ను ఈసీ తాత్కాలికంగా నిషేధించింది. ఈ మేరకు ఈసీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈసీ నిర్ణయంలో తాము కల్పించుకోమని స్పష్టం చేసింది.
నెల కిందటే మోడీ బయోపిక్ విడుదలకు నిర్మాతలు పూనుకోగా.. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటీషన్ పై ఈనెల 15న విచారణ జరిపిన సుప్రీం కోర్టు సినిమా చూసి నివేదిక ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఈ మేరకు 22న సీల్డ్ కవర్ లో ఈసీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది.
తాజాగా ఈరోజు నివేదిక పరిశీలించిన సుప్రీం కోర్టు.. మోడీ బయోపిక్ ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరేలా ఉందన్న ఈసీ వాదనకు ఓకే చెప్పింది. సినిమా విడుదలను నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో మోడీ బయోపిక్ ఎన్నిక పూర్తయ్యే మే 19వ తేదీ వరకు కూడా విడుదల చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బీజేపీ శిబిరం నిరాశకు గురైంది.