లాలూకు ఊహించ‌ని రీతిలో షాకిచ్చిన సుప్రీం

Update: 2017-05-08 06:48 GMT
బీహార్ అధికార‌ప‌క్షంలో భాగ‌స్వామి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతున్నాయి. జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌నం ఆర్నాబ్ గోస్వామి సొంతంగా పెట్టుకున్న రిప‌బ్లిక్ చాన‌ల్ ఓపెనింగ్ రోజునే.. లాలూ లీల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించి దేశ ప్ర‌జ‌ల్ని స‌ర్ ప్రైజ్ చేశారు. ఈ ఉదంతంతో లాలూ ఇబ్బందుల్లో ప‌డ్డారు. బీహార్ లో విప‌క్షాలు.. లాలూపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ పై ఒత్తిడిని తెస్తున్న‌యి.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో జ‌రిగిన ప‌శువుల దాణా కుంభ‌కోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా వ్య‌వ‌హ‌రించిన లాలూ ప్ర‌సాద్ కు గ‌ట్టి దెబ్బ త‌గిలేలా సుప్రీం నిర్ణ‌యం తీసుకుంది. దాణా కుంభ‌కోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు లాలూకు క్లీన్ చిట్ ఇవ్వ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చే్స్తూ సీబీఐ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. దీనికి ఓకే అంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌కు ఓకే చెబుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ రోజుకోర్టు ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికి ఈ ఉదంతాన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. లాలూపై విచార‌ణ‌కు సుప్రీం ఓకే చెప్పింది. ప‌శువుల దాణా కుంభ‌కోణం కేసులో లాలూను దోషిగా తేలుస్తూ సీబీఐ పేర్కొన‌టం.. ఈ ఉదంతంలో ఆయ‌న కొంత‌కాలం జైల్లో ఉండ‌టం తెలిసిందే. అనంత‌రం సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన జార్ఖండ్ హైకోర్టు.. లాలూపై మోపిన అభియోగాల్ని కొట్టేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా సీబీఐ కార‌ణంగా.. కేసును విచార‌ణ‌కు స్వీక‌రిస్తూ సుప్రీం నిర్ణ‌యంతో.. దాణా కుంభ‌కోణం లాలూను వెంటాడ‌నుందన్న విష‌యం మ‌రోసారి రుజువైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News