ఢిల్లీ జేఎన్ యూ వర్సిటీ వివాదం అంతకంతకూ పెద్దది కావటమే కాదు.. ఇతర వర్గాలకు పాకుతున్న పరిస్థితి. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిశిక్ష విధించటంపై పలువురు వ్యతిరేకించటం.. దీనిపై చట్టం తన పని తాను చేసుకోవటం.. తాము చేసిన చర్యను భావస్వేచ్ఛగా చెప్పుకోవటం తెలిసిందే. అఫ్జల్ గురు వర్థంతిని నిర్వహించిన జేఎన్ యూ స్టూడెంట్ యూనియర్ నాయకుడు కన్హయ్య కుమార్ ను అరెస్ట్ చేయటం.. అతన్ని పాటియాలా కోర్టు వద్దకు తీసుకొచ్చిన క్రమంలో పెద్ద ఎత్తు లొల్లి చోటు చేసుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే బుధవారం అతన్ని మరోసారి పాటియాలా కోర్టు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అతనిపై దాడి జరిగిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కు అనుకూల.. వ్యతిరేక లాయర్లు రెండు జట్లుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో పాటు.. జర్నలిస్టులపైనా దాడి చేయటం గమనార్హం. విద్యార్థుల మధ్య మొదలైన లొల్లి క్రమంగా పెరుగుతూ.. చివరకు న్యాయవాదులు సైతం రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే వరకూ విషయం వెళ్లింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. పాటియాలా కోర్టు వద్ద తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. అక్కడి పరిస్థితి సమీక్షించేందుకు.. లాయర్ల మధ్య సర్దుబాటు కోసం సుప్రీంకోర్టు.. సీనియర్ న్యాయవాదులైన కపిల్ సిబల్ తదితరులతో కూడిన బృందాన్ని పంపారు. అక్కడి పరిస్థితిన సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. లాయర్లు ఇలా జట్లుగా మారి కొట్టుకోవటంపై ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విష బీజం భారీ రచ్చకు కారణం కావటమే కాదు.. మిగిలిన వర్గాల్ని సైతం రెండు ముక్కలు చేయటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.