లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు నెలసరి వాయిదాలు చెల్లించడం కష్టమైన తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెండు దశలుగా ఆరు నెలల పాటు మారటోరియం విధించింది. అయితే వాయిదా చెల్లించొద్దని చెప్పింది.. కానీ దాని వడ్డీ కూడా వాయిదా వేయలేదు. దీంతో సామాన్యులు ఎప్పుడైనా వడ్డి చెల్లించాల్సిందే. ఇంకా మారటోరియం వినియోగించుకుంటే రెట్టింపు స్థాయిలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దానిపై విచారణ సాగుతోంది. ఈ సందర్భంగా ఈఎంఐలపై వడ్డీ భారంపై బదులివ్వాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆర్ బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇక మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని - డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్ బీఐ పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంటూ మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం - వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని కోరింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీవ్రంగా చర్చించాల్సిన అంశమని.. ఓ వైపు మారటోరియం వెసులుబాటు ఇస్తూనే మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్ - సంజయ్ కిషన్ కౌల్ - జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన అత్యున్నత ధర్మస్ధానం వ్యాఖ్యానించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు సాగాయి.
లాక్ డౌన్ తో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలకు మారటోరియం వెసులుబాటు ఇచ్చినా వడ్డీ భారం మోపడం సరైంది కాదని పిటిషనర్ గజేంద్ర శర్మ తన పిటిషన్ లో వాపోయారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.