సుప్రీం కోర్టులో రేవంత్‌ కు పెద్ద షాక్‌

Update: 2016-09-19 08:06 GMT
టీ టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి సుప్రీం కోర్టులో పెద్ద‌షాక్ త‌గిలింది! ఆయ‌న పెట్టుకున్న ఓ పిటిష‌న్‌ ను సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. మేట‌ర్‌ లోకి వెళిపోతే.. తెలంగాణ‌లో కేసీఆర్ ఆక‌ర్ష్ ఆప‌రేష‌న్ దెబ్బ‌కి తెలంగాణ‌లోని టీడీపీ ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి మ‌రీ అధికార పార్టీ కారెక్కేశారు. దీనిపై అప్ప‌ట్లో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ రేంజ్‌ లో ఫైర‌య్యారు. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు అలా కారెక్కేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి విన‌తి ప‌త్రం ఇచ్చారు. అయితే, ఆయ‌న దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో టీడీపీ ఎమ్మెల్యేలు సంప‌త్‌ - ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

 స‌ద‌రు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేలా ఆదేశించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు ఇప్ప‌టికే స్పీక‌ర్ స‌హా స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు నోటీసులు పంపింది. అయితే, ఇంత‌లో కేసీఆర్ దెబ్బ‌కి ఎర్ర‌బెల్లి కూడా సైకిల్ దిగి కారెక్కేశారు. దీంతో ఆయ‌న సుప్రీంలో తాను వేసిన పిటిష‌న్‌ ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఇక‌, మిగిలింది సంప‌త్ ఒక్క‌రే. దీంతో ఈ కేసు విచార‌ణ‌లో త‌న‌ను కూడా ఇంప్లీడ్ చేయాల‌ని కోరుతూ టీటీడీపీ నేత - కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ఫిరాయింపుల పిటిష‌న్‌ పై తాజాగా విచారించిన సుప్రీం కోర్టు.. రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఇంప్లీడ్ పిటిష‌న్‌ ను తిర‌స్క‌రించింది.

 ఇక‌, కేసు విచార‌ణ‌ను వ‌చ్చే నెల 19కి వాయిదా వేసింది. అయితే, ఇంప్లీడ్ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌కుండా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించడంపై రేవంత్ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. వాస్త‌వానికి ఈ కేసులో ఇప్ప‌టికే స్పీక‌ర్‌ కి సైతం సుప్రీ కోర్టు నోటీసులు పంపిన నేప‌థ్యంలో.. తాను కూడా ఇంప్లీడ్ అయిన నేప‌థ్యంలో టీడీపీ నుంచి జంప్ చేసిన వాళ్ల‌కి చెమ‌ట‌లు ప‌ట్టించాల‌ని రేవంత్ స్కెచ్ గీశారు. అయితే, ఇప్పుడు ఫెయిల్ అవ‌డంతో కొంత నిరుత్సాహానికి గురైన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News