దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయను ఘోరంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఉరికోసం నిర్భయ తల్లిదండ్రులే కాదు.. దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆ నరరూప కామాంధులకు ఎప్పుడు ఉరిపడుతుందోనని కోర్టుల చుట్టూ ప్రతీసారి చూస్తున్నాయి. అయితే ఏదో ఒక లూప్ హోల్ తో నిందితులు కోర్టులకు, రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటూ ఆలస్యం చేస్తున్నారు.
తాజాగా సుప్రీం కోర్టులో నిర్భయ నిందితుల విషయంలో కీలక తీర్పు వెలువడింది. దోషులకు ఉన్న అన్ని న్యాయ అవకాశాలను నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవని.. అలా చేస్తే అది వారి పౌర హక్కులకు భంగం కలిగించినట్టే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
నిర్భయ నిందితులను విడివిడిగా ఉరితీయాలన్న కేంద్రం పిటీషన్ పై సుప్రీం విచారించింది.దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా న్యాయపరంగా అవకాశాలను వినియోగించుకోలేదని.. అతడు వినియోగించుకునే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని అధికారులు అంటున్నారని సుప్రీం కు తెలిపారు. అయితే ఈ విషయంలో నిందితులను ఒత్తిడి చేయలేరని సుప్రీం జడ్జి తెలిపారు. ఈ కేసును ఫిబ్రవరి 11కు వాయిదా వేశారు.
రాష్ట్రపతి క్షమాభిక్ష - క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయడం వంటి అవకాశాలను నిర్భయ దోషి పవన్ గుప్తా ఇప్పటివరకూ వినియోగించుకోలేదు. మిగతా ముగ్గురు వినియోగించారు. దీంతో ముగ్గురిని ఉరితీసి పవన్ ను ఆపలేని పరిస్థితి. అందుకే న్యాయపరమైన ఈ చిక్కుకు సుప్రీం కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. దీంతో నలుగురు నిందితుల ఉరిశిక్ష మరింత ఆలస్యం కానుంది.