దగ్గర దగ్గర పుష్కరం కంటే వెనుక.. ఈనాడు అధినేత రామోజీరావుకు సంబంధించిన ఒక అంశం తీవ్రసంచలనంగా మారటమే కాదు.. నిత్యం నీతులు వల్లించే పెద్ద మనిషి కూడా తప్పులు చేస్తారా? అంటూ అవాక్కు అయినోళ్లు బోలెడంతమంది ఉన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించేందుకు అధికారం లేకున్నా.. రూల్ పొజిషన్ ను అర్థం చేసుకోవటంలో రామోజీ తప్పు చేశారో..? కావాలనే తప్పు జరిగిందో? కానీ.. ఈ విషయంపైన నాటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఉదంతం అప్పట్లోనే కాదు.. ఇప్పటికి సంచలనమే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని భావించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఛైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయటాన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్.. జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు (శుక్రవారం) విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ సర్కారు కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీం చెప్పటం ద్వారా కీలక పరిణామంగా మారటం ఖాయమంటున్నారు.