రెండు ఆసక్తికర అంశాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తన తీర్పుల్ని ప్రకటించింది. భిన్నమైన రెండు అంశాలకు సంబంధించి అంతే విభిన్నంగా తీర్పులు ఇవ్వటం విశేషం. ఇంతకీ ఆ రెండు అంశాలేమంటే.. ఒకటి అద్దె గర్భంతో తల్లి కావటం.. మరొకటి ముంబయి బార్లలో డ్యాన్సర్ల అంశం. ఈ రెండింటిపై కాస్త అటూఇటూగా ఒకేసారి తీర్పు రావటం గమనార్హం.
మొదట సరోగసీ వ్యవహారంలో.. అద్దె అమ్మల్ని విదేశీయులు వాణిజ్య వ్యవహారంగా భావించటంపై సుప్రీం కన్నెర్ర చేసింది. అద్దె గర్భాన్ని వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్న సుప్రీం కోర్టు.. సరోగసీ టూరిజానికి దేశం ఒక హబ్ గా మారుతోందని వాపోయింది. అందుకే.. దీనిపై నిషేధం విధించాలని..ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించి.. కచ్ఛితమైన చట్టాల్ని రూపొందించాలని సూచన చేసింది.
పిల్లలు లేని విదేశీయులు అద్దె గర్భం ద్వారా పిలల్ని పొందే అవకాశం ఇచ్చేలా.. అలాంటి విధానానికి అనుమతిస్తూ 2013లో కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. ఇదో వ్యాపారంగా మారటంతో.. దీనిపై మొత్తంగా సమీక్షించి స్పష్టమైన చట్టాన్ని రూపొందించాలని సుప్రీం పేర్కొంది.
ఇక.. మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీం తాజాగా స్టే ఇచ్చింది. గతంలో ఇలాంటివి ఉన్నా.. 2005లో ఇలాంటి బార్లపై మహారాష్ట్ర సర్కారు నిషేధం విధించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 2013లో సుప్రీం విచారించి కొట్టేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్సీపీల ప్రభుత్వం ఈ డ్యాన్స్ బార్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరోసారి సుప్రీం తలుపు తట్టిన పిటీషన్ దారుల పిటీషన్ పై విచారించిన సుప్రీం.. డ్యాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లో డ్యాన్స్ బార్లు సందడి చేయనున్నాయన్న మాట.