టెంపర్.. షార్ట్ టెంపర్.. తిక్క.. హైపర్ లాంటి పేర్లతో సినిమాలు వచ్చేయటం.. అందులోని కథానాయుడ్ని ఇలాంటి పేర్లతో పిలవటమో.. లేదంటే అతడిలో ఉండే ఆ గుణాన్ని చూపించటమో చేస్తారు. రీల్ లైఫ్ లో వినిపించే ఈ పేర్లను తాజాగా ఒక ముఖ్యమంత్రికి లింక్ చేసి.. ఒక మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె కమ్ ఎంపీ సుప్రియా సూలే ఫడ్నవీస్ మీద ఘాటు విమర్శలు చేశారు.
ఫడ్నవీస్ కు షార్ట్ టెంపర్ ఎక్కువని.. ఆయన దగ్గరకు వెళ్లాల్సి వస్తే తాను హెల్మెట్ పెట్టుకొని వెళతానంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకిలా అన్న ప్రశ్న వేయకుండానే ఆమే.. ఆ విషయాన్ని చెప్పుకొస్తూ.. ఫడ్నవీస్ కు షార్ట్ టెంపర్ చాలా ఎక్కవని.. ఊరికే ఆగ్రహం చెందుతారని.. అలాంటి సమయంలో ఆయన చేతిలో ఏం ఉంటే దాన్ని విసురుతారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తాను చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశానని.. కానీ.. ఇలాంటి షార్ట్ టెంపర్ ఉన్న ముఖ్యమంత్రిని మాత్రం తాను చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వద్దకు తాను వెళ్లాల్సి వస్తే.. హెల్మెట్ పెట్టుకొని వెళతానని.. ఏదైనా విషయం మీద ఆగ్రహం వస్తే ఆయన ఏ వస్తువునైనా విసిరే ప్రమాదం ఉందన్నారు. నీళ్ల కుళాయిల వద్ద మహిళలు దెబ్బలాడుకునే తీరులో ఫడ్నవీస్ గొడవపడతారని ఆమె మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి మీద ఒక మహిళా ఎంపీ ఈ తీరులో ఫైర్ కావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/