ప్రమాణాలు పాటించటం ఒక అలవాటుగా చేసుకోవటానికి మించిన పని మీడియాలో మరొకటి ఉండదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. పోటీ అన్న పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల తీరుతో కొత్త కొత్త చిక్కులు తెర మీదకు వస్తున్నాయి. సంచలనాలు.. రీడర్ షిప్ కోసం అవసరానికి మించిన హడావుడి.. హుందాతనాన్ని పక్కన పెట్టేసి.. పక్కనోడి కంటే పైచేయిగా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తూ.. తప్పుల మీద తప్పులు చేస్తున్న వైనం ఈ మధ్యన మీడియాలో ఎక్కువైంది.
దీనికి వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పోతోంది. గతంలో ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఒక వార్త వచ్చిందంటే అందులో నిజం ఎంతోకొంత ఉంటుందని.. అన్నీ తనిఖీ చేసుకున్న తర్వాత మాత్రమే వార్తల్ని ప్రచురిస్తారన్న భావన ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటివి మారిపోతున్నాయి. అందరి కంటే ముందు ఉండటం.. అందరి కంటే ఆకర్షణీయంగా వార్తల్ని అందించటం.. ప్రజలకు అవసరమైన వాటి కంటే.. కిక్ ఎక్కించేలా వార్త ఉంటే చాలు.. నిజానిజాల్ని కాసేపు వదిలేద్దామన్న ప్రమాదకర ధోరణి ఈ మధ్య పెరుగుతుంది.
దీని వల్ల జరిగే నష్టం.. మీడియాకు ప్రాణమైన విశ్వసనీయత ప్రజల్లో పోతుంది. ప్రాణం పోయాక ఎంత మీడియా అయినా నిర్జీవంగా మారిపోతుందన్న సత్యాన్ని చాలామంది పట్టించుకోవటం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం విషయంలో తోపుల్లాంటి మీడియా సంస్థలు సైతం తప్పులో కాలేశాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఒక ప్రారిశ్రామిక ప్రముఖుడు తన దగ్గర ఉన్న రూ.6వేల కోట్లు (కొన్ని మీడియా సంస్థలు వేరే మొత్తాన్ని ప్రచురించాయి) బ్యాంకుల్లో జమ చేసినట్లుగా అచ్చేశారు. ప్రింట్ తో పాటు వెబ్ సైట్లలో కూడా ఇదే తీరులో రాసేశారు. కానీ.. ఈ వార్తపై తుపాకీ ఆచితూచి వ్యవహరించింది. ఇది నిజం కాదన్నసందేహాన్ని వ్యక్తం చేసింది. అంత పెద్ద మొత్తమే కానీ సదరు పారిశ్రామికవేత్త జమ చేసి ఉంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించి ఉండేది కదా? అన్న అనుమానాన్ని ఎత్తి చూపింది. మొత్తంగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ జరుగుతున్న ప్రచారాన్ని వార్తగా ఇస్తూ.. సమాచారంలో విశ్వసనీయతను ప్రశ్నించింది.
తుపాకీ అనుమానాలన్నీ నిజమని తాజాగా తేలింది. మొనగాడులాంటి మీడియాసంస్థలు ఈ వార్త విషయంలో తప్పు చేసినట్లుగా రుజువైంది. అదెలానంటే.. తాను రూ.6వేల కోట్లు డిపాజిట్ చేసినట్లుగా వచ్చిన వార్తల్ని గుజరాత్ పారిశ్రామికవేత్త.. వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్ పటేల్ స్పందించారు. అవన్నీ వట్టి వదంతిగానే తేల్చేశారు. తానుఎలాంటి నగదును ప్రభుత్వానికి అప్పగించలేదని.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. ఎక్కడ పుట్టిందో తెలీని వార్తకు హడావుడి హడావుడి చేసి మరీ జాతీయ మీడియా మొదలు కొని స్థానిక మీడియా వరకూ ప్రముఖంగా ప్రచురించిన దానికి.. చేసిన తప్పునకు సమాధానం చెప్పే కన్నా.. ఈ తరహా వార్తల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇవ్వటం ముఖ్యమని గుర్తిస్తే మంచిది. లేకుండా మీడియాకు ప్రాణమైన విశ్వసనీయతను కోల్పోవటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/