సూరత్ వజ్రాల వ్యాపారి మరొకసారి వార్తల్లో నిలిచాడు. కొత్త ఏడాది కానుకగా ఉద్యోగులకు 1200 కార్లను ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ పేరిట సవ్జీబాయ్ ధోలాకియా వజ్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సౌరాష్ట్ర, సూరత్ ప్రాంతాల్లో సవ్జీకాకాగా ఆయన అందరికీ సుపరిచితం. 2013 నుంచి తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు బోనస్ - ప్రోత్సాహకాలుగా కార్లు - ఫ్లాట్లు - నగలు - వజ్రాలను ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 1260 కార్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చారు. ఈసారి కొత్త ఏడాది బహుమతిగా 1200 డాట్సన్ రెడ్ జియో కార్లను ఇస్తున్నారు. గత ఏడాది సంస్థ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందుకోని వారికి మాత్రమే వీటిని అందజేస్తున్నారు.
ఇలా ఒకేరోజు 650 కార్లను ఉద్యోగులకు ఇచ్చారు. కానీ, ఈసారి ఒక మెలిక పెట్టారు. డౌన్ పేమెంట్ చెల్లించి లోన్ కింద కార్లను కొనుగోలు చేశారు. రుణాన్ని ఐదేళ్లపాటు వాయిదాల రూపంలో ప్రతి నెలా సంస్థనే చెల్లిస్తుంది. ఈలోపు ఉద్యోగి ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేస్తే మిగతా రుణాన్ని అతనే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాగే కార్లు గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ చెల్లించలేదనే ఆరోపణలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/