గతిమాన్ పట్టాలెక్కిందోచ్

Update: 2016-04-05 06:36 GMT
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుబండి విజయవంతంగా పట్టాలెక్కింది. బోలెడన్ని విశేషాల సొంతమైన గతిమాన్ ఎక్స్ ప్రెస్ మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపటంతో తన పరుగును మొదలెట్టింది. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు బండిగా మాత్రమే కాదు.. ట్రైన్ హోస్టెస్ లు.. పూర్తిస్థాయి ఎయిర్ కండీషన్ సౌకర్యంతోపాటు.. ప్రయాణికులకు ప్రయాణ సమాచారాన్ని అందించటంతోపాటు.. వినోదానికి టీవీల్ని ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ లో ప్రయాణం మర్చిపోలేని అనుభూతిగా చెబుతున్నారు.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి అగ్రా వరకూ నడుస్తుంది. సుమారు 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం వంద నిమిషాల్లో పూర్తి చేసే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఎంట్రీతో భారతీయ రైళ్ల వేగం మరింత పెరిగిందని చెప్పొచ్చు. గతిమాన్ లో జర్నీ ఒక తీయని అనుభూతిని అందించటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News