ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ స్పీడు మరింత పెరిగింది. ముఖ్యంగా సర్వీస్ రిలేటెడ్ గా టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. అయితే... ఈ క్రమంలో వేర్వేరు సేవలకు వేర్వేరు యాప్స్ అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్స్ ద్వారా సేవలు పొందడం సులభంగానే ఉన్నప్పటికీ అన్ని సేవలూ ఒకే చోట దొరక్క.. దేనికి ఏ యాపో తెలియక... ఏది రైల్వేల ఆథరైజ్డ్ యాపో తెలియక ఇబ్బందిపడేవారూ ఉంటున్నారు. ఇలాంటి కష్టాలకు ముగింపు పలికేందుకు గాను రైల్వే శాఖ త్వరలో అన్ని సేవలకూ ఒకే యాప్ తీసుకురానుంది.
రైళ్లకు సంబంధించిన సమాచారం మొత్తం ఒకే చోట అందుబాటులో ఉండేలా రైల్వే కొత్త యాప్ ను తీసుకురానుంది. రైళ్ల రాకపోకలతోపాటు ప్రయాణ వివరాలు, సమయాల్లో మార్పులు - ప్లాట్ ఫామ్ నెంబర్లు - బెర్తుల లభ్యత ఇలా అన్ని వివరాలను ఈ యాప్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ట్యాక్సీలు - కూలీలు - హోటళ్లు - యాత్ర ప్యాకేజీలు - భోజన సేవలు సహా వివిధ సదుపాయాలను కూడా పొందవచ్చు. జూన్ లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం ఉన్న నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ - ఐఆర్ సీటీసీ - కంప్లయింట్ మేనేజ్ సిస్టమ్ సీఎంఎస్ యాప్ వంటివన్నీ ఇందులోనే కలిపేయనున్నారు. కాగా ఈ యాప్ పేరు హింద్ రైల్ అని చెబుతున్నారు. ఇంకా ఈ పేరు కన్ఫర్మ్ కానప్పటికీ ఇప్పటికే ఇది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. మేరీ రైల్ - ఇ-రైల్ - మై రైల్ - రైల్ అనుభూతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/