‘డియర్’ అనేయొచ్చంటున్న సర్వే ఫలితం

Update: 2016-06-17 09:51 GMT
తనను ఒక కాంగ్రెస్ నేత ‘డియర్’ అంటూ సంబోధిస్తూ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరం చెప్పటం.. ఇప్పుడా విషయం మీద ఆన్ లైన్లో పెద్ద చర్చే నడుస్తోంది. కేంద్రమంత్రి అభ్యంతరంతో మహిళల్ని డియర్ అని సంబోధిస్తూ లేఖ రాయటం తప్పా? అన్న చర్చ ఒకటి మొదలైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ హాట్ టాపిక్ మీద ఒక జాతీయ మీడియా సంస్థ సర్వేను నిర్వహించింది.

డియర్ అన్న పదాన్ని ఉపయోగించొచ్చా? లేదా? అన్న ప్రశ్నతో పాటు మరోరెండు ప్రశ్నల్ని సంధించగా వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. సదరు మీడియా సంస్థ అడిగిన మూడు ప్రశ్నలు.. దానికి పోల్ లో పాల్గొన్న వారిచ్చిన సమాధానాలు చూస్తే..

1.        ఒక మహిళను ‘డియర్’ అని సంబోధించటం సెక్సియస్ట్ రిమార్క్ అవుతుందా?

అవును; 18 శాతం

కాదు ; 82 శాతం

2.        కొత్తగా ఎవరైనా మహిళకు లేఖ రాయాల్సి వస్తే ఏమని సంబోధిస్తే బాగుంటుంది?

హాయ్ అన్నది బాగుంటుందని 31 శాతం

డియర్ అన్నది బాగుంటుందని 35 శాతం

హలో అంటే బాగుంటుందని 30 శాతం

రెస్పెక్టెడ్ (గౌరవనీయులు) అంటే బాగుంటుందని 14 శాతం

3.        ఒక మహిళకు రాసే లేఖకు ముగింపులో ఏం రాస్తే మంచిది?

యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిల్ ఫుల్లీ అని 16 శాతం

రిగార్డ్స్ అని 69శాతం

ఆల్ ద బెస్ట్ లేదా చీర్స్ అని 15 శాతం
Tags:    

Similar News