కరోనా కారణంగా ఉద్యోగులు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమలకే పరిమితం అయిపోయారు. దీంతో ఏడాదిన్నరగా ఉద్యోగుల మధ్య ఈ-మెయిల్స్, ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌లతో మాత్రమే సదరు యాజమన్యాలు పనులు చేయించుకుంటున్నాయి. తమ ఉద్యోగులతో కేవలం ఫోన్ కాల్స్ లేదంటే, వీడియో కాల్స్ ఆధారంగా మాత్రమే మీటింగ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక వీటి ద్వారానే సమీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ కారణాలతో ఉద్యోగులకు, యాజమాన్యాలకు మధ్య రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ తగ్గిపోతున్నాయని చెప్పాలి.
వాస్తవానికి కంపెనీ సక్సెస్ కావాలంటే టీం వర్క్ చాలా ముఖ్యం. నలుగురు కలిస్తేనే కొత్త ఐడియాలు పుట్టుకువస్తాయి. అప్పుడే కంపెనీ ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. ఇలాంటి లాభాల కోసమే టీంల మధ్య ఇంటెరాక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని చెబుతుంటారు. ఇక కరోనాకు ముందు ఇలా టీమ్‌ల మధ్య ఎంతగానో కమిట్‌మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనే చెప్పాలి. ఇప్పనుడు కరోనా వచ్చిన తర్వాత సగటున వర్క్ ఫ్రమ్ హోం చేసేవారు పెరిగిపోయారు. దీంతో కొలీగ్స్ మధ్య గడిపే టైం 25 శాతం మేర పడిపోయిందని చాలా సర్వేలు తెలిపాయి.
ఇలా సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల కొత్త ఐడియాలు రాకపోవడం వర్క్ విషయంలో కూడా వెనకబాటుతో ఇన్నోవేషన్ దెబ్బ తింటోంది. దాంతో పాటే కంపెనీ ప్రొడక్టివిటీపైనా కూడా ఇది బాగా ఎఫెక్ట్ చూపుతోందని తెలుస్తోంది. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎంప్లాయిస్ వ్యక్తిగత జీవితంపై చాలా ప్రతికూల వాతావరణాలు సృష్టిస్తోందని చెబుతున్నారు. ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడటం, గతంలో కంటే కూడా ఎక్కువగా గొడవలు వస్తుండటం గమనార్హం.
ఇక పిల్లల ఉన్న వారికి అయితే వారి పనులు పూర్తిగా ఆగిపోతున్నాయనే కంప్లయింట్లు వస్తున్నాయి. ఇలా చాలా రకాల కారణాలు చివరకు వర్క్ మీద ప్రభావం చూపెడుతున్నాయి. ఇంకోవైపు కంపెనీ ఇస్తున్న టార్గెట్లు కూడా ఉద్యోగుల్ని మనశ్శాంతిగా పనిచేసుకోనివ్వట్లేదు. ఆఫీసులో ఉంటే పనిమీద మాత్రమే ధ్యాస ఉంటుంది. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇది అందరికీ ఇబ్బందిగా మారింది.
ఇక మానిటరింగ్ పేరుతో కంపెనీలు కూడా ఉద్యోగుల్ని క్షణం తీరిక లేకుండా సమస్యలకు గురి చేస్తున్నాయంట. ఇలా ఉద్యోగులు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగుల మానసిక స్థితిపై ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం చూపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల మెదడు చాలా వరకు మొద్దుబారిపోతోందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.
స్కిల్స్‌ను పెంచుకునే వాళ్లకు కూడా ఇలాంటి ఒత్తిడి క్షణం తీరిక లేకుండా చేయడం వల్ల ఇబ్బంది ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇలాంటి వాటితో పాటు కొందరికి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే సిగ్నల్స్ లేక పోవడం వల్ల గంటల తరబడి వర్క్ ఆగిపోవడం లేట్ కావడంతో చిరాకు పడుతున్నారు. దీంతో చాలా వరకు ఉద్యోగులు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దని, ఆఫీసులకు వచ్చేస్తామని చెబుతున్నారంట.