ముచ్చట పడేలా ఉండే స్మార్ట్ ఫోన్ కు భారతీయులు బానిసలు అవుతున్నారా? అంటే అవుననే చెబుతోంది తాజాగా వెల్లడైన సర్వే ఒకటి. స్మార్ట్ ఫోన్ కారణంగా మానవసంబంధాల్ని మాత్రమే కాదు మనశ్శాంతిని.. ఆనందాల్ని మిస్ అయిపోతున్నారట. దేశ ప్రజల జీవితాల్లో భాగమైన స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు శరీరంలో ఒక అవయువంగా మారిందని చెప్పక తప్పదు. స్మార్ట్ ఫోన్ లేకుండా ఊహించుకోలేమన్నంత తీవ్రంగా దాని మోజులో పడిపోయినట్లుగా సర్వే చెబుతోంది.
సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో పాటు చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కలిసి నిర్వహించిన సర్వే నివేదిక తాజాగా బయటకు వచ్చింది. దేశ ప్రజలు ఏడాదిలో సగటున75 రోజులు ఏకంగా స్మార్ట్ ఫోన్ కు పరిమితమైపోతున్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. అంటే.. ఏడాదిలో 1800 గంటలు స్మార్ట్ ఫోన్ లోనే లీనమైపోతున్నట్లు చెప్పటమే కాదు.. ఫోన్ లేకుండా తాము బతకలేమన్నట్లుగా పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇదే రీతిలో స్మార్ట్ ఫోన్ వాడుకుంటూ పోతే మానసిక.. శారీరక సమస్యలు ఎక్కువ కావటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడప్పడు స్మార్ట్ ఫోన్ ను స్విచ్ఛాప్ చేస్తే ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ పుణ్యమా అని 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నెలలో పలుమార్లు తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకోగలుగుతున్నట్లు చెప్పారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు తాము తమ స్నేహితుల్ని.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కనీసం ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నట్లు పేర్కొనటం విశేషం.
సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ముగ్గురు మాత్రం స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటేనే మరింత ఆనందంగా ఉంటామని చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ వద్ద.. తమ పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు తెలిపారు. హైస్కూల్ పిల్లలు 41 శాతం మంది ఫోన్ కు బాగా అలవాటు పడినట్లు గుర్తించారు.