భారత దేశం అనేక మతాల సమాహారం. ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ ఇన్ని మతాలు ఉండవు. అన్నింటికీ సమానమైన ఆదరణ దొరికేది మనదగ్గరే అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇక మిగతా ఏ దేశంలోనూ లేని, ఉండని మతం ఒకటి మన దేశంలో చెలమాణీ అవుతోంది.
అదే... క్రికెట్. ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఎవరికీ ఉండదని అనుకుంటా కూడా. భారత్ లో క్రికెట్ ఓ మతం అని ఎప్పుడో తీర్మానించేశారు. దీనికి దేవుడును కూడా నిర్ణయించేశారు. ఆ దేవుడే.. 'సచిన్ టెండూల్కర్'. ఎవరినైనా అడిగి చూడండి.. క్రికెట్ దేవుడు ఎవరని? సచిన్ పేరే చెబుతారు. ఇదంతా ఎందుకంటే..?
ఏ గల్లీలో చూసినా
మన దేశంలో పిల్లలు.. ఆఖరికి పెద్దలు కూడా క్రికెట్ ఆడని గల్లీ ఏదైనా ఉందేమో చెప్పండి. పోనీ.. మైదానం ఎక్కడైనా ఉందేమో చెప్పండి. ఏ సందులో కాస్త సందు దొరికినా మన వాళ్ల మూడు వికెట్లు పెట్టేసి, బంతి బ్యాటు పట్టుకుంటారు. భారత్ లో క్రికెట్ అంటే అంత క్రేజు మరి. అందుకే ఏ గల్లీలో గోడను చూసినా వికెట్ గీతలు కనిపిస్తాయి. అంతెందుకు.. మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి విధ్వంసక క్రీడాకారులు గల్లీ క్రికెట్ నుంచే పుట్టుకొచ్చారు. మరోవైపు ధోనీ, సెహ్వాగ్ లా ఆడగలిగేవారు ముంబై వంటి నగరంలో వందల మంది ఉంటారని చెబుతారు. అందుకే గల్లీ క్రికెట్ ను తేలిగ్గా తీసివేయలేం. ఏమో..? అందులోంచి ఏ ధోని పుట్టొచ్చో?
నయా సూపర్ స్టార్ అక్కడి నుంచే వచ్చాడు
సూర్యకుమార్ యాదవ్. టీమిండియా నయా సూపర్ స్టార్. అలవోకగా భారీ షాట్లు కొడుతూ మంచినీళ్లు తాగినంత సులువుగా పరుగులు సాధిస్తుంటాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనదైన వైవిధ్యంతో షాట్లు కొడుతుంటాడు. ఆసియా కప్ లో బుధవారం హాంకాంగ్‌పై సూర్య ఇలానే చెలరేగాడు. ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ (59*)తో కలిసి మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించాడు.
ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టడం విశేషం. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఇలా చెలరేగడం వెనుక ఉన్న సీక్రెట్‌ను వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ''ఇలాంటి షాట్లను ఇంతకుముందు ప్రాక్టీస్ ఏమీ చేయలేదు. అయితే, చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సిమెంట్ రోడ్ మీద రబ్బర్ బంతులతో క్రికెట్ ఆడటం వల్లే ఇలాంటి షాట్లు సాధ్యవుతాయని నా అభిప్రాయం'' అని తెలిపాడు. అర్థమైందా..? గల్లీ క్రికెట్ దమ్మేంటో?
సూర్యకు ప్రమోషన్?
దూకుడుగా పరుగులు సాధిస్తున్న సూర్య ప్రస్తుతం నాలుగో, ఐదో స్థానంలో దిగుతున్నాడు. కానీ, అతడిని వన్ డౌన్ లో పంపాలనే డిమాండ్లు వస్తున్నాయి. వాస్తవానికి వెస్టిండీస్ టూర్ లో సూర్య ఓపెనర్ గా వచ్చాడు. రాణించాడు కూడా. అయితే, కేఎల్ రాహుల్ రావడంతో నాలుగో స్థానంలోకి వెళ్లిపోయాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో సూర్య కంటే ముందే జడేజా నాలుగో స్థానంలో వచ్చాడు. హాంకాంగ్ తో మ్యాచ్ లో మాత్ర సూర్యనే నాలుగో నంబరుగా బరిలో దిగాడు. అయితే, అతడి సామర్థ్యాన్ని పూర్తిగా వినిగియోంచుకోవాలంటే ఓపెనర్ లేదా మూడో స్థానంలో పంపడమే సరైనది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.