బీహార్ మాజీ ముఖ్యమంత్రి - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విభిన్నమైన రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరేం అనుకున్నా... తనదైన శైలిలో ప్రత్యేకమైన నిర్ణయాలతో ముందుకు సాగడం లాలు స్పెషాలిటీ. అలాంటి డిఫరెంట్ స్టైల్ తోనే లాలు ప్రసాద్ ఏం చేశారో తెలుసా? తన పార్టీ నాయకుల వద్ద అమ్యామ్యాలు పుచ్చుకొని కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. తద్వారా కేంద్ర మంత్రి పదవులు పొందడం ఎలా అనే విషయంలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఒకింత ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆర్జేడీ రథసారథి లాలూపై బీహార్ కు చెందిన బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ-1 ప్రభుత్వం హయాంలో కేంద్రంలో కీలక మంత్రి పదవుల కేటాయింపు కోసం రఘునాథ్ ఝా - కాంతి సింగ్ లు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సంప్రదించారు. కేంద్రమంత్రి పదవులు పొందేందుకు ఆ నేతలు ఏం చేశారంటే.. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భూమి బహుమతిగా ఇచ్చారని సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీహార్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. అయితే ఒక రోజు తరువాత ఆర్జేడీ ఆ విషయాన్ని అంగీకరించింది.
కేంద్ర మాజీ మంత్రులు రఘునాథ్ ఝా - కాంతి సింగ్ లు కుటుంబానికి ఆస్తులు ఇచ్చారని ఆ పార్టీ అంగీకరించింది. అయితే అది క్విడ్ ప్రోకో కాదని స్పష్టం చేసింది. పాట్నా జిల్లా దానూపూర్ వద్ద 41 - 400 చదరపు అడుగుల స్థలాన్ని లాలూ సతీమణి - మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి లీజుకు ఇచ్చినట్లు సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. ఇది 2006లో జరిగింది. అయితే 2010 సదరు భూమిని రబ్రీదేవి పేర ఆ భూమిని ఆ మంత్రులు రిజిష్టర్ చేయించినట్లు సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/