ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి.. చిన్నమ్మగా సుపరిచితురాలు సుష్మా స్వరాజ్ సారీ చెప్పారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ లో దొర్లిన తప్పునకు హుందాగా క్షమాపణలు చెప్పేశారు. ఇటీవల మోడీ నేపాల్ పర్యటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జానక్ పూర్ లో ప్రధాని మోడీ ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. దీనికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ లక్షలాది మంది భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారంటూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేయటం పెను దురమారాన్ని రేపింది.
చివరకు నేపాలీ నేతలు సైతం సుష్మ ట్వీట్ పై రియాక్ట్ అయ్యారు. మోడీ మాట్లాడింది నేపాలీలతో కానీ.. భారతీయులతో కాదంటూ నేపాల్ కు చెందిన ఒక ఎంపీ విమర్శించారు. తాను చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ.. ఆమె ట్వీట్‌లో రియాక్ట్ అయ్యారు. ఆ తప్పు తన వల్లే జరిగిందని.. అందుకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.
మోడీ గురించి తాను మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన ఆమె.. నేపాల్ తో సహా విదేశాల్లోని భారతీయులందరికి చేరువ అయ్యేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. మోడీని ఉద్దేశించి సుష్మ పొరపాటుగా వ్యవహరించటం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ ఆమె ఇలాంటి తప్పునే చేశారు.
మోడీ సర్కారు నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన సుష్మా.. అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ మొదలు నేపాల్ లోని జానకీ పూర్ వరకు లక్షలాది మందిని భారతీయుల్ని కలుసుకొని మాట్లాడిన తొలి ప్రధాని మోడీ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపైనా పలువురు తీవ్రంగా తప్పు పట్టారు. నేపాల్ సార్వభౌమాధికారాన్ని చాలా సాధారణంగా తీసేసినట్లుగా చిన్నమ్మ తీరు ఉందనన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ రియాక్ట్ అయిన చిన్నమ్మ సింఫుల్ గా సారీ చెప్పేసి ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి.