వైద్యం కోసం భారత్ కు రావాలనుకుంటున్న పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయిస్తూ వారి పాలిట కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అపద్బాంధవురాలిలా మారిన సంగతి తెలిసిందే. ఓ చిన్నారి ఆపరేషన్....కాలేయ వ్యాధితో బాధపడుతున్న మరో మహిళ - గుండె వ్యాధితో బాధపడుతున్న మరో చిన్నారి....ఇలా ఎంతోమంది పాకిస్థానీలకు సుష్మ ఆప్తురాలయ్యారు. సుష్మ తమ దేశ ప్రధాని అయితే ఎంత బాగుండో అనుకునే వారు కొందరైతే....ఆమెను దైవాంశసంభూతిరాలిగా 'ఇబ్నే-ఎ-మరియం` (మేరీ మాత కుమారుడు - ఏసు ప్రభువు అని అర్థం) అని సంబోధించేవారు మరికొందరు. దాయాది దేశాల మధ్య దౌత్య సంబంధాలను పక్కనబెట్టి మానవత్వంతో సుష్మా వ్యవహరిస్తున్న తీరుకు పాకిస్థానీలందరూ ఫిదా అయిపోయారు. తాజాగా, మరోసారి తన మానవతా దృక్పథాన్ని సుష్మ చాటుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని పాస్ పోర్టు పోగొట్టుకున్న ఓ భారతీయుడికి సుష్మ అభయమిచ్చారు. సమయానికి భారత్ చేరుకొని పెళ్లి పీటలెక్కుతామని హామీ ఇచ్చారు.
అమెరికాలోని వాషింగ్టన్ లో నివసిస్తోన్న రవితేజ పెళ్లి ఆగస్టు 13న జరగనుంది. దీంతో, ఆగస్టు 10న భారత్ వచ్చేందుకు రవితేజ సిద్ధమయ్యాడు. అయితే, పొరపాటున అతడు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు. తన పాస్ పోర్టు పోయిందని - తన పెళ్లి సకాలంలో జరిగేందుకు దయచేసి సాయం చేయాలని కోరాడు. అయితే, ఎప్పటిలాగే ఆ ట్వీట్ కు స్పందించిన సుష్మ....రవితేజకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. `మీరు రాంగ్ టైంలో పాస్ పోర్టు పోగొట్టుకున్నారు. అయినా పర్లేదు. మీరు సకాలంలో పెళ్లికి హాజరయ్యేలా సాయం చేస్తాను`అని సుష్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన సుష్మా స్వరాజ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మ ఉండటం తమ అదృష్టం అని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుష్మగారే విదేశాంగ శాఖ మంత్రిగా ఉండాలని ట్వీట్స్ చేస్తున్నారు.