ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన చిన్నమ్మ

Update: 2016-12-19 11:19 GMT
దేశంలో కీలక నేతలంతా ఆసుపత్రి పాలవుతుంటే జనం చాలా ఆందోళన చెందుతున్నారు. సోనియా గాంధీ తరచూ ఆసుపత్రి పాలవుతున్నారు. కరుణానిధి ఆసుపత్రిలో ఉన్నారు. జయలలిత 75 రోజులు చికిత్స పొంది ఆసుపత్రిలోనే కన్నుమూశారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కూడా మూత్రపిండాలు పాడై ఆసుపత్రిలో ఉండడంతో ఎందరో ఆందోళనకు గురయ్యారు. పైగా ఆమెకు కిడ్నీ దాతలు ఒక పట్టాన దొరకలేదు. అయితే.. చివరకు ఆమెకు సరిపడా కిడ్నీ దొరకడకంతో ఆపరేషన్ విజయవంతమైంది. తాజాగా ఆమె ఈ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జి అయ్యారు కూడా.
    
సుష్మా స్వరాజ్  రెండు వారాలుగా ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌ ను విజయవంతంగా నిర్వహించారు. సుష్మా ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమెను డిశ్చార్జి చేసేందుకు నిర్ణయించారు.
    
20 సంవత్సరాలుగా డయాబెటిస్ తో బాధపడుతున్న సుష్మాకు నవంబరులో కిడ్నీ ఫెయిలైంది. కిడ్నీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కొన్ని రోజులు వైద్యులు డయాలసిస్ చేశారు. అనంతరం సుష్మాకు సరిపోయే కిడ్నీ దొరకడంతో డిసెంబర్ 10న శస్త్రచికిత్స నిర్వహించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News