సుష్మా స్వరాజ్ రెండు కిడ్నీలు విఫలమయ్యాయి

Update: 2016-11-16 07:32 GMT
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మూత్రపిండాలు పనిచేయకపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 10 రోజులుగా ఆమె ఎయిమ్స్ లోనే ఉన్నారు. చాలాకాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్న ఆమెకు కిడ్నీ సమస్య తలెత్తింది. ప్రస్తుతం వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు.

కాగా సుష్మ తన అనారోగ్య సమస్య గురించి ట్విట్టర్ లో పంచుకున్నారు. కిడ్నీ మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కాగా... సుష్మ ట్వీట్ తరువాత ఆమె అనారోగ్యం గురించి తెలియడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ - జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు వెంటనే స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.

మరోవైపు ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆమెకు విపరీతమైన ఫాలోవర్లు ఉన్నారు. వారిలో చాలామంది తమ కిడ్నీ దానమివ్వడానికి ముందుకొస్తూ ట్వీట్లు చేశారు. ''మీ సేవలు దేశానికి అవసరం.. మీరు అంగీకరిస్తే మా కిడ్నీ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ పలువురు ట్వీట్ చేశారు. కాగా కొద్ది నెలల కిందట కూడా ఆమె ఛాతీనొప్పి - తీవ్ర జ్వరం వంటి సమస్యలతో 21 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News