ఆమెపై వీడియో పోస్ట్ చేసిన సుష్మా

Update: 2017-06-26 06:34 GMT
దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్న మాజీ లోక్ స‌భ స్పీక‌ర్ మీరాకుమార్‌ కు ఇబ్బంది క‌లిగించే వీడియోను ట్వీట్ చేశారు కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్‌. లోక్ స‌భ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించే స‌మ‌యంలో మీరా కుమార్ స‌భ‌ను న‌డిపిన తీరు.. ప్ర‌తిప‌క్ష నేత హోదాలో మాట్లాడుతున్న నేత విష‌యంలో ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పు ప‌ట్టేలా స‌ద‌రు వీడియో ఉంది.

అత్యుత్త‌మ స్థానాల్లో ఉండే వ్య‌క్తుల‌కు ఉండ‌కూడ‌ని ల‌క్ష‌ణాలు మీరాకుమార్‌ కు ఎంత‌లా ఉన్నాయ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేలా ఉన్న వీడియోను సుష్మా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. 2013లో తాను లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో యూపీఏ స‌ర్కారు అవినీతిపై ప్ర‌సంగించే స‌మ‌యంలో స్పీక‌ర్ స్థానంలో ఉన్న మీరా కుమార్ ఆమె ప్ర‌సంగాన్ని ప‌దే ప‌దే అడ్డుకున్న‌ట్లుగా స‌ద‌రు వీడియోలో క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలి ప‌ట్ల లోక్ స‌భ స్పీక‌ర్ ఎలా ప్ర‌వ‌ర్తించారో ఇందులో చూడొచ్చు అన్న వ్యాఖ్య‌ను వీడియోకు జ‌త చేశారు.

ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో సుష్మ ప్ర‌సంగాన్ని మీరా 60 సార్లు అడ్డుకున్నార‌న్న వార్తా క‌థ‌నం ఈ వీడియోకు  జ‌త చేసి ఉండ‌టం గ‌మ‌నార్హం. నాటి యూపీఏ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌డుతూ త‌న ప్ర‌సంగంతో సుష్మా నిప్పులు చెరుగుతున్న వేళ‌.. స్పీక‌ర్ హోదాలో ఉన్న మీరాకుమార్ ప‌దే ప‌దే.. ఆమె ప్ర‌సంగాన్ని ముగించాల్సిందిగా కోర‌టం ఈ వీడియోలో ఉంది. థాంక్యూ.. ఆల్ రైట్ అనే ప‌దాల‌తో త‌న ప్ర‌సంగాన్ని ముగించాల్సిందిగా స్పీక‌ర్ స్థానంలో కూర్చున్న మీరాకుమార్ ప‌దే ప‌దే అన‌టం ఈ వీడియోలో ఉంది. పార్టీల‌కు.. వాటి రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స్థానంలో ఉన్న వేళ‌.. మీరాకుమార్ ఎలా వ్య‌వ‌హ‌రించారో చూడండి అనేలా సుష్మ పోస్ట్ చేసిన వీడియో ఉండ‌టం గ‌మ‌నార్హం.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News