భారత విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణం పట్ల విదేశీ రాజకీయ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. సుష్మా మరణంపై భారతీయ రాజకీయ నేతలతో పాటు - సామాన్య ప్రజలు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి యువతలో సుష్మా స్వరాజ్ కు మంచి క్రేజ్ ఉండేది. దీంతో వారంతా బాధా తప్త హృదయాలతో సుష్మాకు నివాళి ఘటించారు.
ఇక పలువురు విదేశీ నేతలు కూడా సుష్మ మరణంపై స్పందిస్తున్నారు. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు - ఆయన ప్రధాన సలహాదారు ఇవాంక ట్రంప్ కూడా ఉన్నారు. సుష్మా స్వరాజ్ తో తనకున్న అనుబంధాన్ని పేర్కొంటూ ఇవాంక స్పందించింది.
భారత్ ప్రజాసేవకురాలిని కోల్పోయిందని ఇవాంక పేర్కొన్నారు. సుష్మాతో పరిచయం తనకు గౌరవనీయమని ఇవాంక ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ తో తన ఫొటోలను ఇవాంక ట్వీట్ చేశారు. ఆమె అకాల మరణం పట్ల చింతిస్తున్నట్టుగా ఇవాంక పేర్కొన్నారు.
సుష్మా స్వరాజ్ భారత విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఇవాంక ఇండియాలో పర్యటించారు. అప్పుడు ఆమె హైదరాబాద్ కు కూడా వచ్చారు. ఇక అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా సుష్మ మరణం పట్ల స్పందించారు. ఆమె తమకు స్నేహితురాలని అమెరికాన్ ఫారెన్ సెక్రటరీ మైక్ పాంపియో పేర్కొన్నారు.