ఐర్లాండ్ నుంచి వచ్చి స‌ర్పంచ్ ఎన్నిక‌ల బ‌రిలో..

Update: 2019-01-15 08:25 GMT
తెలంగాణలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో హాట్ హాట్ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీల నేత‌లు ఎత్తులు చేస్తుండ‌గా మ‌రోవైపు యువ‌త సైతం పెద్ద ఎత్తున ఆస‌క్తిని చూపిస్తోంది. తాజాగా - సర్పంచ్ పదవి కోసం ఓ యువతి ఐర్లాండ్ దేశంలో ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చింది. త‌న తండ్రి వార‌స‌త్వాన్ని సొంతం చేసుకున్న ఈ యువ‌తి ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే పోటీ చేస్తున్నారు. ఈ ప‌రిణామం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లికి చెందిన సుస్మిత నాయుడు ఐర్లాండ్‌ లోని డబ్లిన్ బిజినెస్ స్కూల్‌ లో ఎంబీఏ పూర్తిచేసి అక్కడే హెచ్‌ సీఎల్ టెక్నాలజీస్ సర్వీసెస్‌ లో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్‌ గా ఉద్యోగాన్ని సాధించారు. ఏడాదిగా ఉద్యోగం చేస్తున్న సుస్మిత - పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పారు. ఎడపల్లి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలుచేశారు. సుస్మిత 1994 సెప్టెంబర్ 12న జన్మించారు. బోధన్‌ లోని ఇందూర్ మోడల్ స్కూల్‌ లో ఎస్సెస్సీ - విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హైదరాబాద్ అరోరా డిగ్రీ కాలేజీలో బీబీఏ అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు. సుస్మిత తండ్రి శంకర్‌ నాయుడుకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన గతంలో బోధన్ చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్‌ గా - 1995 - 2013లో జరిగిన ఎడపల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ గా ఎన్నికయ్యారు. 2001లో ఎడపల్లి ఎంపీటీసీగా గెలుపొందారు.




Tags:    

Similar News