రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయం మీద కాసింత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో భేటీ కావటం.. ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ఆరా తీయటం.. వ్యాక్సినేషన్ లెక్క అడగటం.. కరోనా కేసుల లెక్కల వివరాల్ని సేకరించటం ఇదంతా చూస్తే.. ఉప ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడినట్లేనని చెప్పాలి. వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి గడువు డిసెంబరు వరకు ఉంది.
మూడో వేవ్ వార్తల నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణ ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటివేళ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సమీక్షను నిర్వహించటం.. వివరాల్ని సేకరించటం.. రాష్ట్రాల వారీగా పరిస్థితులపై ఆరా తీయటం చూస్తే.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. వ్యాక్సినేషన్ జరిగిన వివరాల్ని.. కరోనా కేసుల నమోదు తెలంగాణ వ్యాప్తంగా కంట్రోల్ లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఆర్నెల్ల గడువు ముంచుకొస్తున్న వేళలో.. ఈ సమీక్ష జరిగినట్లుగా చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం చూస్తే.. ఉప ఎన్నికల్ని అక్టోబరు లేదంటే నవంబరులో నిర్వహించే వీలుందని చెబుతున్నారు. కాస్త అటుఇటుగా అయితే దసరా.. లేదంటే దీపావళికి ఉప ఎన్నిక జరిగే వీలున్నట్లు తెలుస్తోంది.
అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ తన పార్టీ పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా నిర్వహించిన సమీక్షతో ఉప ఎన్నిక దగ్గర్లోకి వచ్చేసినట్లే అన్నఅంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్.. బీజేపీలు తమ అభ్యర్థుల్ని డిసైడ్ చేయటం.. వారు ప్రచారంలో ముమ్మరంగా చేస్తుండటం తెలిసిందే. ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాల్ని సిద్ధం చేసుకున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా కసరత్తు చేశాయి. తాజా సమీక్షతో మరోసారి ఉప ఎన్నిక వేడిని మరింత పెంచిందని చెప్పాలి.
మరోవైపు ఖాళీ అయినా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం ఎన్నికలు జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికతో పోలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి తక్కువగా ఉంటుందని చెప్పాలి. ఈసారి తెలంగాణలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాల్ని చూస్తే.. ఎమ్మెల్యేలు ఎన్నుకోవటం ద్వారా ఎంపిక జరగనున్న నేపథ్యంలో త్వరగానే ఎన్నికల ప్రక్రియకు పెద్ద హడావుడి ఉండదనే చెప్పాలి.