ఉత్తరప్రదేశ్ అంటేనే ఈ మధ్య వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ రాష్ట్రం అల్లకల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. హత్రాస్ లో దళిత బాలికను నలుగురు అత్యాచారం చేసి హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక అగ్రవర్ణాల ఆగడాలు అంతులేకుండా ఆ రాజ్యంలో నిరసనలు కొనసాగాయి. ఇక మరో బాలికపై కూడా ఇటీవల అత్యాచారం జరిగింది. ఇక యూపీ పోలీసుల తీరుపై లెక్కలేనన్ని ఆరోపణలు. అప్పట్లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేకు పోలీసులే సహకరించారనే ఆరోపణలు వచ్చాయి.
వివాదానికి కేంద్రబిందువులు అవుతున్న యూపీ పోలీసుల తీరు మారోసారి వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్ లో గడ్డం తీయనందుకు ఓ ఎస్ఐని సస్పెండ్ తాజాగా చేయడం వివాదాస్పదమైంది.
బాగ్ పత్ ఎస్ఐగా పనిచేస్తున్న ఇంతెజర్ అలీని గడ్డం తీసుకోవాలని అధికారులు మూడు సార్లు హెచ్చరించారు. అయినా పట్టించుకోకపోవడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
పోలీస్ మాన్యువల్ ప్రకారం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకునేందుకు అనుమతి ఉందని.. మిగతా వారు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందేనని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక వేళ గడ్డం ఉంచుకోవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనుమతి తీసుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.