చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి నాటి వైఎస్ జగన్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఐపీఎస్ అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు పేరు అప్పట్లో మారుమ్రోగింది. జగన్ ను కేసులతో.. ఆయన వ్యూహాలతో హైజాక్ చేసి దెబ్బతీశారని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ టాక్ ఉంది. ఈ క్రమంలోనే జగన్ సీఎం అయ్యాక ఏబీపై సస్పెన్షన్ వేటు పడింది. అదిప్పటికీ తొలిగిపోకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఏబీ వేంకటేశ్వరరావు తన సస్పెన్షన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై ఈరోజు విచారణ జరిగింది. ఆయన సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని పేర్కొంది.
కేంద్రప్రభుత్వం నుంచి తగిన నిర్ధేశాలు కోరామన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్ధేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు.
రెండేళ్ల తర్వాత కేంద్రాన్ని నిర్ధేశాలు అడుగుతారా? అని సుప్రీంకోర్టు సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఎల్.పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదన్న ధర్మాసనం.. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.
అయితే ఏబీ వెంకటేశ్వర రావు రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను సవాలు చేస్తూ క్యాట్ తలుపులు తట్టాడు. కానీ క్యాట్ ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరువాత క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించినా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం జరుగుతోంది.
గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి నాటి ప్రతిపక్ష వైసీపీని ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపిఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వర్ రావుపై ఓ కేసులో విచారణ జరిపి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ పై ఆయన హైకోర్టుకు ఎక్కారు.. ప్రభుత్వం సస్పెన్షన్ ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని వైయస్ఆర్సిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్ ను వేసింది. ఏబీ కూడా సుప్రీం తలుపుతట్టడంతో ఈ కేసు నడుస్తోంది.