రైతులు ఆందోళన చేస్తుంటే..ఆడికార్లు..బంగారు గాజులు ఉంటాయా?

Update: 2020-01-05 05:10 GMT
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఫేమస్ అయిన సినీ నటుడు.. ఎస్వీబీసీ చానల్ ఛైర్మన్ అయిన పృధ్వీరాజ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలోనే ఏపీ రాజధానిని కంటిన్యూ చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ధర్నా.. ఆందోళన చేస్తున్న రైతులపై ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతి పేరుతో ఆందోళన చేస్తున్న వారిలో రైతులు లేరన్నారు. రైతుల పేరుతో చేస్తున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వ్యాఖ్యానించారు. నిరసనలు చేస్తున్న వారంతా నిజంగా రైతులే అయితే..వారి దగ్గర ఆడికార్లు.. మహిళలకు బంగారు గాజులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అమరావతిలో ఉద్యమంగా జరుగుతున్నదంతా కార్పొరేట్ నడిపిస్తోందన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇవేమీ కనిపించవా? అంటూ మండిపడ్డారు. అమరావతిని ఏపీ రాజధానిగా మార్చొద్దంటూ అమరావతికి చెందిన రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే..ఈ ధర్నాలు.. నిరసనలు అన్ని కూడా టీడీపీ కార్యకర్తలు తీసుకొచ్చి చేయిస్తున్నవేనని చెప్పారు.

కృష్ణా జిల్లా  నుంచి తీసుకొచ్చిన నిరసనకారులతో వీటిని నిర్వహిస్తున్నారని.. ఆందోళన చేస్తున్న వారంతా నిజమైన నిరసనకారులైతే.. వారు ఏ గ్రామానికి చెందిన వారో ఆధార్ కార్డులు చూపించాలన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రైతులు అయితే మాత్రం బంగారు గాజులు ఉండకూడదా? అన్న ప్రశ్న వరకూ ఓకే అయినా.. ఆడికారు మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. థర్టీఇయర్స్ పృధ్వీ వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది.


Tags:    

Similar News