స్వచ్ఛ భారత్ కు ప్రపంచబ్యాంకు సాయం

Update: 2015-12-17 12:08 GMT
పారిశుద్ధ్య నిర్వహణ, 2019 నాటికి ఇండియాలో బహిరంగ మల విసర్జన అనేదే ఉండరాదన్న లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఆర్తిక సాయం చేస్తోంది. ఇందుకు గాను భారత ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణాన్ని అందించింది. ఇది మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించి కేటాయించింది.
   
భారత్ లో నివసిస్తున్న ప్రజల్లో సుమారు 75 కోట్ల మంది సరైన పరిస్థితుల మధ్య జీవించడం లేదు. గ్రామీణ భారతంలో అత్యంత అపరిశుభ్ర అలవాటుగా ఉన్న బహిరంగ మలవిసర్జన వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. అయినా, భారత్ లో ఇప్పటికీ దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఇది సామాజిక పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
   
దేశంలో ప్రతి పది మరణాల్లో ఒకటి పారిశుద్ధ్య లోపాల కారణంగానే సంభవిస్తోంది. ఇలాంటి పరిస్థుతుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతతో భారతదేశాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇంటాబయటా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచ బ్యాంకు కూడా స్వచ్ఛభారత్ కు ప్రోత్సాహంగా రుణమివ్వడం శుభ పరిణామం.
Tags:    

Similar News