కాస్త పేరున్న స్వామీజీ అయితే చాలు.. ఏ మాత్రం మొహమాటపడకుండా కాళ్లకు మొక్కేందుకు సిద్ధమన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఆయన తన చేతల్లో చేసి చూపించారు. ఇలా కేసీఆర్ చేత కాళ్లు మొక్కించుకున్న స్వామీజీల్లో పరిపూర్ణనంద ఒకరు. తాను కాళ్లు మొక్కిన స్వామీజీనే తర్వాతి కాలంలో ఆయన హైదరాబాద్ నగర బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకోవటం మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. తాజాగా పరిపూర్ణంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మద్య నిషేధం కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కటానికైనా సిద్ధమని స్వామి ప్రకటించారు. దిశ కన్నీటి శాపం తెలంగాణ నేలకు తగలకుండాలంటే దశల వారీగా మద్య నిషేధాన్ని విధించాలని ఆయన కేసీఆర్ ను కోరారు.
ప్రజల బలమైన ఆకాంక్షలకు అనుగుణంగానే దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారే తప్పించి.. ఇందులో పోలీసు.. ప్రభుత్వ ఘనత ఏమీ లేదన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయాన్ని పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్రంలో మద్యనిషేధం అంత తేలికైన విషయమా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడొస్తున్న ఆదాయం అంతకంతకూ తగ్గిపోవటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీతో పాటు.. ఎక్సైజ్.. పెట్రోల్ డీజిల్ మీద వచ్చేదే ఎక్కువ.
ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయవనరును వదులుకుంటే మరిన్ని తిప్పలు ఖాయం. అలాంటప్పుడు మద్యపాన నిషేధాన్ని ఎందుకు తీసుకొస్తారన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం చాలా అవసరం. అలాంటివేళ బంగారు బాతుగుడ్డలను రోజుకొకటి చొప్పున తీసుకుంటారే కానీ.. దాన్ని చంపేయాలని అనుకోరు కదా? కాళ్లు పట్టుకోవటానికైనా సిద్ధమన్న స్వామీజీ మాటలకు సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.