ఆధ్యాత్మిక భక్తుడు అయిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఒక్కోసారి అదే వర్గానికి చెందిన వర్గాల నుంచి భలే కామెంట్లు ఎదురవుతున్నాయి. చంద్రబాబు విషయంలో స్వామీజీలు పెద్దగా కామెంట్లు చేయకపోయినా....బాబు ఊసెత్తితేనే ఒంటికాలిపై లేచే విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మరోమారు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో పుష్కరాలు - చంద్రబాబు పరిపాలన - యాగాల గురించి స్పందించిన స్వరూపానందేంద్ర.. ఈ దఫా కొత్త పాయింట్ తో విమర్శ ఎక్కుపెట్టారు.
తిరుమలలో ఈ నెల 2న నిర్వహించిన ధార్మిక సదస్సు నిర్వహణ కేవలం కంటితుడుపు చర్యేనని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ నుంచి గాని, హిందూ ధార్మిక ట్రస్ట్ నుంచి గానీ తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అందుకే తాను ఆ సదస్సుకు రాలేదని స్పష్టం చేశారు. పీఠాధిపతులు - మఠాధిపతుల సలహాలు పాటించకుండా ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహించడం వ్యర్థమని స్వరూపానంద స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. పనిలో పనిగా టీటీడీపైనా ఓ ఆరోపణ చేశారు. 18 గిరిజన ప్రాంతాలలో మతమార్పిడులు అడ్డుకునేందుకు ఆలయాలు నిర్మించాలని టీటీడీని కోరితే స్పందించలేదని వ్యాఖ్యానించారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చంద్రబాబు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబుపైనే నేరుగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి బలం లేదని...ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కూడా మండిపడ్డారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం ప్రశ్నించారు. ఇటీవలే బాక్సైట్ తవ్వకాలపైనా తనదైన శైలిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.