బీజేపీ - టీడీపీ పొత్తుపై స్వామి హాట్ కామెంట్స్

Update: 2021-01-22 13:10 GMT
టీడీపీ-బీజేపీ.. ఈ బంధం ఈనాటిది కాదు.. కేంద్రంలో నాడు వాజ్ పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో నాటి ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో అధికారం పొందాయి. గడిచిన 2014 ఎన్నికల్లోనూ ఏపీలో పొత్తు పెట్టుకొని అధికారం సాధించాయి.

కానీ మాట తప్పిన బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కటీఫ్ చేసుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో జట్టు కట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉబలాటపడుతున్నాడు. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతోనే అంటకాగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబును అస్సలు పట్టించుకోవడం లేదు.

తాజాగా ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు గురించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆంధ్రాలో ఉన్న కొందరు భవిష్యత్తులో బీజేపీ-టీడీపీ కూటమి కడుతాయని కలలు కంటున్నారని.. కానీ అది జరగదని.. అలా అని నేను జగన్ పార్టీతో పొత్తుకు అనుకూలంగా లేనని.. బీజేపీ తన సొంతకాళ్లపై నిలబడడం నేర్చుకోవాలని’ స్వామి పేర్కొన్నారు.

దీన్ని ఏపీలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని.. సొంతంగానే బలపడుతుందని స్వామి మాటలను బట్టి తెలుస్తోంది.
Tags:    

Similar News